వైద్య ఖర్చులకు ఇద్దరికీ ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) వెల్ఫేర్ సొసైటీ. ఆర్థికసాయం

పయనించే సూర్యుడు ,జులై 07,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, సారపాక గ్రామానికి చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) వెల్ఫేర్ సొసైటీ. ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల కేంద్రంనికి చెందిన ఇద్దరికీ వైద్య ఖర్చులకోసం 10000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.గత కొంత కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ ఆశ అనే మహిళ నోటి క్యాన్సర్ అని నిర్ధారణ కాగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నారు గత డిసెంబర్ నెలలో ఈమెకు మేవా ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఆమె ఆరోగ్యం కొంతవరకు కుదుటపడటంతో మరోసారి వైద్య ఖర్చుల నిమిత్తం మేవా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆశ కి మేవా వెల్ఫేర్ సొసైటీ తరుపున మరోసారి రూ. 5000 వేల రూపాయలు ఆర్దిక సహాయం ను అందజేశారు .అదేవిధంగా మండల కేంద్రం లోని గౌతంపురం కానీ చెందిన షేక్ మహబూబ్ అలీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్నారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించి మేవా కమిటీ తరఫున వారికి కూడా 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేవా ప్రతినిధులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇందులో భాగస్వామీ అయిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నార ఆశ . మహబూబ్ అలీ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహమ్మద్ ముస్తఫా గ్రామ పెద్దలు షేక్ దస్తగిరి. మహమ్మద్ ఇమ్రాన్. సోహెల్ పాషా. ఖమర్. అబ్దుల్ సలీమ్. రెహమాన్.గౌస్. తదితరులు పాల్గొన్నారు