పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 23.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభు వైష్ణవి దేవి ఆలయంలో జేష్ట మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి, అభయాంజనేయ స్వామికి ,నాగభైరవ స్వామికి ,పంచామృతాభిషేకం చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చౌడేపల్లి, పుంగనూరు ,చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు ఉబేదారులుగా పుంగనూరుకు చెందిన గౌరీ శంకర్ పుష్పలత వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.