పయనించే సూర్యుడు జూన్ 6, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కాకినాడ జిల్లా పిఠాపురం లో ప్రతిపక్ష పార్టీ వైసీపీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయని క్రింద స్థాయి కార్యకర్తల ఆవేదన. మండల కమిటీలలో గ్రామ కమిటీలలో ఒకే సామాజిక వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మిగతా సామాజిక వర్గాలకు మాత్రం ఏ విధమైన అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉందని గ్రామ స్థాయిలో నాయకుల ఆవేదన?. ప్రతిపక్షంలో ఉంటేనే ఇలా ఉంటే అధికార పక్షంలో ఉంటే ఎలా ఉంటారు అని అనుమానం కనీస గౌరవం గాని మర్యాదగాని లేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కులాలు పార్టీకి బలము అంటారు. పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం ఎస్సీలు కనిపించరు ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్న పార్టీ అధినేతపై నియోజకవర్గ ఇన్చార్జి పై ఉన్న ప్రేమతో బయట పడలేని పరిస్థితిలో వైసిపి నాయకులు ఉన్నారు కొన్ని గ్రామాలలో ఒక సామాజిక వర్గం పూర్తిగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకరు ఇద్దరు నాయకులను జనసేన పార్టీ నుండి అద్దెకు తెచ్చుకుని వైసిపి పార్టీలో పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులు. దళితులను ఎప్పుడూ ఓటు బ్యాంకు లాగే ఉపయోగించుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత దూరం పెడుతున్నారు తప్ప ఎస్సీ ల కు ఏ విధమైన న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులు. పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ వంగా గీత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసు కుంటారో వేసిచూడాల్సిన పరిస్థితి ఎస్సీలు పార్టీకి అవసరమా లేదా అన్నది పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. పార్టీలో మార్పు రాకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.