వైస్సార్ సీపీ ఇంచార్జి తోట నరసింహం జన్మదిన వేడుకలకు తరలి వెళ్లిన గోకవరం మండల వైసీపీ నాయకులు.

పయనించే సూర్యడు పత్రిక జూలై 07 గోకవరం మండల రిపోర్టర్ దొరబాబు: మాజీమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు,జగ్గంపేట నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తోట నరసింహం 64వ జన్మదిన వేడుకలకు గోకవరం మండలం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వెళ్లి గజమాలలుతో సత్కరించి,భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పంచుకొంటూ సంబరాలు జరుపుకుంటు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షం లో ఉన్న ప్రజలు పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరానికి నిరంతరం కృషి చేస్తూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కి అంకితభావంతో సేవలందిస్తున్న మీ సేవాభావం మరెందరికో స్పూర్తి.భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,విజయాలు ప్రసాదించి,మరెన్నో సంవత్సరాలు ప్రజా సేవ చేసే శక్తిని,అవకాశన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలం వైస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.