వ్యక్తిగత దూషణలు కోవర్టు రాజకీయాలు చేయొద్దు : మధుసూదన్ రాయల్

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 1.06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండలంలో రాజనాల బండ. దగ్గరవ్యక్తిగత విమర్శలతో పాటు కోవర్ట్ రాజకీయాలు మానుకోవాలని పుంగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్, బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన బోడె రామచంద్ర యాదవ్ కు సూచించారు.
గత వారం ముందు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడైన బోడే రామచంద్ర యాదవ్ నారా లోకేష్ బాబు పైన అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగిందన్నారు, దానికి గాను తాను ఆ మరుసటి రోజు ఆయనకు ఒక కౌంటర్ విసరడం జరిగిందన్నారు, రాజకీయ పరంగా కౌంటర్ విసరడం జరిగిందనీ. దానికి గాను పూల ప్రేమ్ కుమార్. అనే వ్యక్తి తన పుట్టుక సరైనదైతే తమ నాయకుడు ఖర్జూరపు నాయుడు, వాళ్ళ డబ్బు ఏమన్నా సంక్షేమాలకు ఇస్తున్నాడా అనే దుర్భాషలాడిన మాటలు వాస్తవ మన్నారు, ఆ వీడియో కావాలంటే మీడియా ముఖంగా తాను చూపించగలనన్నాడు . మీరు కరెక్ట్‌గా ఉంటే నిజాయితీపరులతే మీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ . వైఎస్సార్సీపీ కోవర్టు కాదు అని ఈ రాజనాల బండలో ప్రమాణం చేయమని చెప్పాలన్నారు, పార్టీలో నాయకులు కాకుండా నేరుగా ఆయనే వచ్చి సత్య ప్రమాణం చేయాలన్నారు, పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బీజేపీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్రస్తుతం బీసీవైలో ఉన్నాడననీ రాజకీయ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లవచ్చునున్నారు, నిజాయితీపరుడివైతే, నిజాయితీగా రాజకీయం చేసేవాడెనని పుంగనూరులో ఉన్న షటిల్ కోర్టుని ప్రేమ్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కాదా అని ఆయన ప్రశ్నించారు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న రాజనాల బండ పై ప్రమాణాలు చేయాలంటే ఇక్కడ ఉన్న స్థితిగతులు అందరికీ తెలుసు అన్నారు. అయితే బీసీవై పార్టీ వారు ఇతర దినాలలో ప్రమాణానికి కట్టడం హాస్యాస్పదమన్నారు , బుధవారం నాడు వచ్చి తన పైన అవాకులు చవాకులు పేల్చాడన్నారు, శనివారం తాను ప్రమాణ స్వీకారానికి వస్తే తాను వచ్చిన సమయంలో బీసీవై పార్టీకి చెందిన వారు ఎవరూ లేరని ఆయన అన్నారు. ఆలయాల దగ్గర ఇలాంటి రాజకీయం చేయకూడదని బీసీవై పార్టీ నాయకుల రాజకీయం 2019 లోనే అందరూ చూసినారన్నారు, ఇటీవల కాలంలో బిసివై పార్టీ అధ్యక్షుడు రాష్ట్రమంతా తిరుగుతూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారని 2009 నుంచి ఆ చట్టం ఉన్నప్పటికీ గత వైసిపి ప్రభుత్వం లో ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు .వైసిపి తో కోవర్టు రాజకీయాలు చేస్తున్నాడు. అనేందుకు ఈ ఒక్క నిదర్శనం చాలు అన్నారు, అంతే కాకుండా పులివెందులలో వైఎస్ఆర్సిపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేయించాడని బీసీవై పార్టీ నాయకులు అంటున్నారని అయితే ఆ స్టేషన్ సీఐ నవ్వుతూ ఆయనను లోనికి తీసుకు వెళ్లడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు, ప్రజల్లోకి రాకుండా ప్రజా సమస్యలపై స్పందించకుండా రాబోయేది బిసివై పార్టీ అని రాష్ట్రానికి ప్రత్యామ్నాయక్ పార్టీ బీసీవైఏ అని ఏ విధంగా అనుకుంటున్నారని ప్రశ్నించారు, సొంత నియోజకవర్గమైన పుంగనూరులో మీ పరిస్థితి ఏమిటి అన్నారు, రాజకీయాల్లో కొనసాగాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలని హిత వు పలికారు అనంతరం తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న అభివృద్ధి సంక్షేమాలను గురించి వివరించారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,