పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 14 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 1989 లో ఎన్టీఆర్ పాలనలో అశ్వరావు పేట లో వ్యవసాయ కళాశాల స్థాపన 2026 లో ఉద్యాన కళాశాల స్థాపన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ అశ్వారావుపేట 254 ఎకరాల్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు సీఎం ఎన్టీఆర్ కు వ్యవసాయ కళాశాల ప్రతిపాదన చేసిన నాటి మంత్రి తుమ్మల 35 ఏళ్లలో 2500 మంది అగ్రి బీ, ఎస్సీ స్టూడెంట్స్ పాస్ ఔట్ ఈ ఏడాది మే 14 న హార్టికల్చర్ కాలేజ్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి తుమ్మల వ్యవసాయ మరియు ఉద్యాన విద్యకు అడ్డాగా మారింది అశ్వారావుపేట ముప్పై ఆరు ఏళ్ళ క్రితం ప్రారంభమైన అగ్రికల్చర్ కాలేజ్ ప్రస్థానంలో వందల మంది అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ పాస్ ఔట్ అయ్యారు మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలనే నాటి మంత్రి తుమ్మల ప్రతిపాదనకు నాటి సీఎం ఎన్టీఆర్ ఆమోదం తో అశ్వరావుపేట లో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటైంది బ్యాచ్ కు ముప్పై మంది విద్యార్థులతో మొదలై ప్రస్తుతం 450 మంది బ్యాచ్ తో క్లాస్ రూం టూ ఫీల్డ్ విధానంలో అగ్రీ బీఎస్సీ సూడెంట్స్ తయారవుతున్నారు. వ్యవసాయ విద్యకు మంత్రి తుమ్మల వేసిన బాటలో జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆగ్రి కాలేజ్ ప్రస్థానం ఇలా వ్యవసాయం ప్రధానంగా ఉన్న మన దేశంలో వ్యవసాయ విద్య కు ఎంతో గౌరవం గుర్తింపు వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు పద్ధతులు పంటల ఉత్పత్తి పెరగాలంటే, మన ఆరోగ్యం బాగుండాలంటే వైద్యులు ఎంత అవసరమో పంటలు పండాలంటే చీడ పీడలు లేకుండా పైర్లు పచ్చగా ఉండాలన్నా మంచి దిగుబడులు రావాలన్నా వ్యవసాయ విద్య ప్రాధాన్యం గుర్తించారు మంత్రి తుమ్మల ఉమ్మడి రాష్ట్రంలో 1989 లో ఎన్టీఆర్ పాలన లో నాటి ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ కళాశాల ఏర్పాటు ప్రతిపాదన చేసారు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన అశ్వారావు పేట ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగుకు అనువైన వాతావరణం ఉండటంతో పాటు ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటంతో వ్యవసాయ విద్య అభ్యసించే విద్యార్థులకు ప్రయోజనంగా ఉంటుందని వ్యవసాయం అంటే ఎంతో మక్కువ గల తుమ్మల లాంగ్ విజన్ తో పట్టుదలతో సీఎం ఎన్టీఆర్ కు వ్యవసాయ కళాశాల ఏర్పాటు కు ఆమోదం తెలిపారు 254 ఎకరాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటైంది 30 మంది బ్యాచ్ తో మొదలై బ్యాచ్ కు 460 ఆగ్రీ స్టూడెంట్స్ మొదటి ఏడాది అగ్రికల్చర్ కాలేజ్ లో అగ్రీ బీ. ఎస్సీ కోర్స్ లో 30 మంది విద్యార్థులు తో మొదలై ప్రస్తుతం ఒక్కో బ్యాచ్ లో 450 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంది ప్రస్తుతం కాలేజ్ లో నాలుగు బ్యాచ్ ల విద్యార్థులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో 1964 లో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వ విద్యాలయం హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఏర్పాటైంది 1996 లో ప్రముఖ రైతు నాయకుడు ఎన్ జీ రంగా జ్ఞానపాకార్ధం ఆయన పేరు పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో వ్యవసాయ విశ్వ విద్యాలయం పేరు స్వర్గీయ ఆచార్య జయ శంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం గా పేరు పెట్టారు. 1989 లో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధ కళాశాల గా అశ్వారావుపేట లో 1989 లో ఎన్టీఆర్ పాలనలో వ్యవసాయ కళాశాల ప్రారంభం అయింది హార్టికల్చర్ హబ్ అశ్వారావు పేట లో నాణ్యమైన ఆగ్రీ విద్య ఉద్యాన పంటలకు కేరాఫ్ గా మారింది అశ్వరావుపేట ఆయిల్ పామ్ కొబ్బరి కోకో వక్క జామ అరటి బొప్పాయి తోటలు పూల తోటల సాగు ఎక్కువ వ్యవసాయ విద్య అభ్యసించే విద్యార్థులకు చుట్టు పక్కల ఉద్యాన తోటలు అందు బాటులో ఉండటం తో ప్రాక్టికల్ గా ఎంతో ప్రయోజన కరంగా మారింది తరగతి గదిలో నేర్చుకునే పారాలు ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో నేర్చుకుంటూ విద్యార్థులు నాణ్యమైన విద్య అభ్యసించే అవకాశం అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజ్ విద్యార్థులకు ఉందంటున్నారు ఆ కాలేజ్ విద్యార్థులు వ్యవసాయ విద్యకు బాటలు వేసిన మంత్రి తుమ్మల రైతుబిడ్డ గా ఉన్న తుమ్మల వ్యవసాయం అంటే ఎంతో మక్కువ దాంతో వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు పద్ధతులు మేలు రకం వంగడాలు చీడ పీడలు లేకుండా పచ్చని పైర్లు పెరిగి పంటలు పండి మంచి దిగుబడులు రావాలన్నా ఆహార ఉత్పత్తులు పెరగాలంటే మనకు ఆరోగ్యం బాగోలేక పోతే డాక్టర్లు ఉన్నట్లే పంటలకు డాక్టర్లు మాదిరి వ్యవసాయ విద్య అభ్యసించే విద్యార్థులను తయారు నాడు ఎన్టీఆర్ పాలనలో వ్యవసాయ కళాశాల నేడు 'రేవంత్ పాలనలో ఉద్యాన కళాశాల స్థాపన చేయాలనే లాంగ్ విజన్ తో నాడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల వ్యవసాయ కళాశాల ఏర్పాటు ఆవశ్యకత పై సీఎం ఎన్టీఆర్ కు వివరించి కాలేజ్ ఏర్పాటుకు పట్టుపట్టారు రైతులు అంటే ఎంతో మక్కువ చూపే ఎన్టీఆర్ వ్యవసాయ కళాశాల ఏర్పాటు కు ఆమోదం తెలిపారు ఎన్టీఆర్ పాలనలో 36 ఏళ్ల క్రితం ప్రస్థానం మొదలైన అగ్రికల్చర్ కాలేజ్ అభివృద్ధి లో చంద్రబాబు క్యాబినెట్ లో తరువాత కేసీఆర్ క్యాబినెట్ లో ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల నిత్యం వ్యవసాయ కళాశాల అభివృద్ధికి పాటుపడి వేలాది మంది వ్యవసాయ విద్య పట్టభద్రులు తెలంగాణకే గర్వ కారణం గా మారేలా చేసిన మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేసారని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ కాలేజ్ తో అశ్వారావుపేట ఖ్యాతి పెంచారని వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ పాలనలో హార్టికల్చర్ కాలేజ్ సాధించిన మంత్రి తుమ్మల ఎన్టీఆర్ పాలనలో అశ్వారావుపేట లో వ్యవసాయ కళాశాల స్థాపించిన మంత్రి తుమ్మల 36 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో ఈ ఏడాది మే 14 తేదీన ఉద్యాన కళాశాల ప్రారంభోత్సవం చేశారు వ్యవసాయ మరియు ఉద్యాన విద్యకు కేరాఫ్ గా అశ్వారావుపేట ను మంత్రి తుమ్మల మార్చారని విద్యార్థులు రైతులు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.