పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ) మే 22. మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావుపేట్ ఏరియాలోని నేషనల్ హైవే కి ఆనుకొని ఉన్న శక్తి బార్ లో గురువారం దొంగతనం జరిగింది. ఉదయం యధావిధి సమయానికి బార్ తెరవడానికి వచ్చిన యజమాని లోపలికి వెళ్లేసరికి క్యాష్ కౌంటర్ చిందరవందరగా ఉంది వెంటనే గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ చూసి పోలీస్ వారు దర్యాప్తు చేపట్టగా అందులో సుమారు రాత్రి మూడు గంటల సమయంలో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. వెనుక వైపు నుంచి టెర్రస్ పైన ఉన్న తలుపులను పగలగొట్టి బార్ లోపలికి చొరబడి ఈ దొంగతనానికి పాల్పడినట్టు సి సి ఫుటేజ్ లో రికార్డు అయింది. ఇది ఇలా ఉండగా గతంలో కూడా ఈ బార్ లో దొంగతనం జరిగినట్టు యజమాని తెలిపారు. గత మూడు రోజుల నుంచి వరుస దొంగతనాల పట్ల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.