శాలిగౌరారం మండల పిఏసిఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి సతీమణి తాళ్లూరి నిర్మల సంతాప సభ

నిర్మలకు నివాళులు అర్పించిన నాయకులు

పయనించే సూర్యుడు మే 28(శాలిగౌరారం) నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి సతీమణి తాళ్లూరి నిర్మల మరణం పట్ల స్థానికంగా నిర్వహించిన సంతాప సభలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ నోముల వెంకన్న మాట్లాడుతూ నిర్మల మృతి బాధాకరమని పేర్కొన్నారు.మురళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.మాధవరం గ్రామ సర్పంచ్ పరశురాములు మాజీ నీటి సంఘం చైర్మన్ దొంతురి యాదగిరి చామల మహేందర్ రెడ్డి వేముల గోపినాథ్ ఇందనూరి శ్రీనివాస్ యారాల వెంకటరెడ్డి జాంగిర్ దస్తగిరి దాసరి శీను దాసరి ఉదయ్ గంగాధరి వీరస్వామి మరియు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొని నిర్మల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.