శివశంకర్ గౌడ్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ పాత్రికేయ పురస్కారం,

జనం న్యూస్ తూప్రాన్ జూన్ 7 జాతీయ తెలుగు సారస్వత పరిషత్,తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద గంగా సదన్ లో ఏర్పాటుచేసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉత్తమ పాత్రికేయ పురస్కార ప్రధానోత్సవ ప్రత్యేక కార్యక్రమం లో .మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్,జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ రామునిగారి శివశంకర్ గౌడ్ కు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఉత్తమ పాత్రికేయ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల ప్రధాన సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్, శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయికుమార్ తదితరుల చేతుల మీదుగా ఈ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 18 మందిని ఎంపిక చేయగా అందులో మెదక్ జిల్లా నుంచి రామునిగారి శివశంకర్ గౌడ్ కు ఈ అవకాశం దక్కింది.ఉత్తమ పాత్రికేయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో జ్యోతి దినపత్రిక సంపాదకులు నాంపల్లి శ్రీనివాస్ తోపాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు కవులు,కళాకారులు పాల్గొన్నారు. దాదాపు 34 సంవత్సరాలుగా పాత్రికేయుడిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ,సామాజిక సేవా రంగంలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించిన శివశంకర్ గౌడ్ కు ఉత్తమ సేవా పురస్కారం దక్కడం సముచితం, సంతోషకరమని పలువురు ప్రశంసించారు. ఇన్నేళ్లుగా పత్రికా రంగంలో పనిచేస్తూ మంచి రిపోర్టర్ గా రాణిస్తున్న శివశంకర్ గౌడ్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డుతో గొప్ప గుర్తింపు,గౌరవం దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు.