శ్యామ్ యాదవ్ దాతృత్వంతో క్రీడా మైదానం శుభ్రత .

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 5 గూడూరు పట్టణంలోని ఏ పీ టీ డబ్ల్యూ ఆర్ మినీ గురుకుల క్రీడా ప్రాంగణం లో గడ్డి, ముళ్ళకంపలు పెరిగి విద్యార్థునులు క్రీడలకు ఆడేందుకు ఇబ్బందిగా ఉన్నదని మినీ గురుకులం హెడ్ మాస్టర్ కె వి .రజిని కుమారి మయూరి శ్యామ్ యాదవ్ దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన శ్రీకృష్ణ సేవాసమితి ఫౌండర్ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందర్ రావు(మయూరి శ్యామ్ యాదవ్) క్రీడా మైదానాన్ని సొంత నిధులతో శుభ్రపరచడం జరిగింది. మినీ గురుకులం హెడ్మాస్టర్ రజనీకుమారి, పి ఈ టి నాగూరమ్మ పర్యవేక్షించారు.