శ్రీకాళహస్తిలో ఘనంగా ‘ఉత్తమ పాత్రికేయ పురస్కారప్రధానం

★ జర్నలిస్ట్ బాశెట్టి హరీష్‌కు ఉత్తమ పాత్రికేయ పురస్కారం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 06 ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికారంగం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధిగా నిలుస్తోందని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్ అన్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో వార్షిక 'ఉత్తమ పాత్రికేయ పురస్కార' ప్రదానోత్సవం శుక్రవారం శ్రీకాళహస్తిలోని గంగా సదన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ​ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వప్రధాన సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తిరుపతి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమ వెన్నం, ప్రముఖ జర్నలిస్ట్ బాశెట్టి హరీష్ కు 'ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని' అందజేసి ఘనంగా సత్కరించారు.

.

​సత్యనిష్ఠతో కూడిన జర్నలిజం అభినందనీయం

​ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్యాయాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం కలం యోధులుగా పోరాడే పాత్రికేయుల సేవలు అమూల్యమైనవన్నారు. సత్యనిష్ఠ, ధైర్యం, నిబద్ధతలతో విధి నిర్వహణ చేస్తూ, సమాజ చైతన్యానికి తోడ్పడుతున్న జర్నలిస్టులను గౌరవించుకోవడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.

​పురస్కార గ్రహీతలకు అభినందనలు

​దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే పాత్రికేయుల బాధ్యత ఎంతో కీలకమైందని అన్నారు. అవార్డు అందుకున్న బాశెట్టి హరీష్‌తో పాటు, ప్రతి ఏటా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి దినపత్రిక సంపాదకులు నాంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రముఖులు, భాషాభిమానులు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు