శ్రీ కాటమ్మ తల్లి ఆటో యూనియన్ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ జులై 6 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్..పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆర్ టి సి కాంప్లెక్స్ వద్ద శ్రీ కాటమ్మ తల్లీ ఆటో యూనియన్ వారు అమ్మవారి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలాస శాసన సభ్యులు గౌతు శిరీష హాజరయ్యారు. ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘటాన్ని స్వయంగా మోసి అమ్మవారిపై తనకు గల భక్తిని ప్రదర్శించారు. పలాస నియోజకవర్గం ప్రజలపై చల్లని కరుణ చూపించాలని ఎమ్మెల్యే అమ్మవారిని కోరుకున్నారు. కార్యక్రమంలో పలాస తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు