పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, మే 31 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు హుండీ లెక్కింపు జరిగినది, 60 రోజులకు గాను శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సాధారణ ఖాతా ద్వారా 91,95,850/- రాగా, మిశ్రమ బంగారం:-25 గ్రాములు,మిశ్రమ వెండి:-380 గ్రాములు వచ్చింది అని,విదేశీ కరెన్సీ యుఎస్ఏ.:-123 డాలర్స్,లండన్:-30 పౌండ్స్,బ్రెజిల్ :- 20 డాలర్స్, సెంట్రల్ బ్యాంకు అఫ్ లైబ్య 6 డినర్స్ వచినవి అని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ప్రకటన చేశారు, ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి జయ ప్రకాష్ బాబు, కార్యనిర్వాహణ అధికారి బి.వి సుబ్బారావు,డిప్యూటీ కమిషనర్ మరియు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మహేశ్వర్ రెడ్డి, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ చుంచు రమేష్ బాబు.దేవస్థానం సిబ్బంది మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.