శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం.

పయనించే సూర్యుడు, జులై 9, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ రామకృష్ణ విద్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత విద్యాసంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులతో పాటు, చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను ప్రదానం చేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి కరికె ఊర్మిళ ప్రసాద్ బాబు, ప్రిన్సిపల్ నిమ్మ రాంరెడ్డి సంయుక్తంగా తెలియజేశారు. గత ఏడాది పదవతరగతి ఫలితాల్లో బచ్చన్నపేట మండల టాపర్లుగా నిలిచి పాఠశాల కీర్తిని చాటిన పోలొజు భావన, సుహన బేగంలను బచ్చన్నపేట వాస్తవ్యులు కొత్తపల్లి రాజయ్య ప్రత్యేకంగా అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ​గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ పోటీలలో శ్రీ రామకృష్ణ విద్యాలయం నుండి నలుగురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. ​ ఎంపికైన విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ గుడాల ఫ్యామిలీ ఫౌండేషన్ నిర్వాహకులు వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించడం పట్ల పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.