శ్రీ శనీశ్వర స్వామి వారికి హుబ్లీ పిఠాధిపతి ప్రత్యేక పూజలు.

పయనించే సూర్యుడు జూన్ 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ అధిక జేష్ట మాసమని వడ్డేమాన్ లోని శ్రీ సార్ధా సప్త జేష్ట మాత సమేత శనీశ్వర స్వామికి శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హుబ్లీ కాశీ శాఖ పీఠాధిపతి 108 శ్రీశ్రీశ్రీ రాజశేఖర్ శివ మహా చార్య స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వర స్వామి వారికి తీలా తైలా అభిషేక పూజలతో పాటు అష్టోత్తర మహన్యాస పూర్వక పూజల నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్రముగల పరమశివునికి రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి స్వామివారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ విశ్వనాథ శాస్త్రి, ఆలయ చైర్మన్ గోపాలరావు ,కమిటీ సభ్యులు, సర్పంచ్, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.