సంక్షేమ సారధి ఎన్టీఆర్ కు మహానాడు సాక్షిగా ఘన నివాళులు

పయనించే సూర్యుడు-29-05-2026-రాజంపేట న్యూస్ : సంక్షేమ సారధి ఎన్టీఆర్ కు మహానాడు సాక్షిగా తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులర్పించారు. ఆంధ్రుల అన్నగా ఆత్మగౌరవానికి ప్రతీకగా, సంక్షేమానికి సారధిగా నిలిచిన నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ బ్రాండ్ మరింత పెరిగేలా ముందుకు కదులుతామని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పది క్లస్టర్లలో తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పిస్తూ మహానాడును మెగా సక్సెస్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, రాజంపేట రూరల్, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, సుండుపల్లి, వీరబల్లి మండలాలలో రెండవ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులు అర్పించడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ రాజకీయాలలో గౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని, సామాన్య రైతు కుటుంబం నుంచి దేశ ఉన్నత స్థానానికి ఎదిగే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే ఉందని, అణగారిన వర్గాలకు అండగా, సామాన్య కార్యకర్తకు భరోసాగా, ప్రజలకు బాసటగా, అభివృద్ధికి చిరునామాగా, సంక్షేమానికి సారధిగా తెలుగుదేశం పార్టీ పాలకులు నిలుస్తారని, అందుకే ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవం లభిస్తుందని తెలియజేశారు. మహానాడు వేడుకలలో రెండవ రోజు ఆయన నియోజవర్గంలోని 10 క్లస్టర్లను పరిశీలించి కార్యకర్తలకు మరింత ఉత్తేజాన్ని అందించారు. తెలుగుదేశం పార్టీలో అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం పార్టీని స్థాపించారని, అదే స్ఫూర్తితో తెలుగువారు తల ఎత్తుకునేలా గతంలో సైబరాబాద్ ను నిర్మించామని, నేడు దేవతల రాజధాని అమరావతిని ఆంధ్ర ప్రజల రాజధానిగా తీర్చిదిద్దబోతున్నామని, ఇది ప్రతి తెలుగుదేశం నాయకునికి, కార్యకర్తకు తల ఎత్తుకొని సగౌరవంగా మాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునెలా చరిత్రలో నిలిచిపోనున్నదని ఆయన తెలియజేశారు. టిడిపి అంటే ఒక బ్రాండ్ అని విజన్ 20-20 అయినా, నేడు విజన్ 2040 అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళలకు సముచిత స్థానం కల్పించడం కోసం మాత్రమే ముందు చూపుతో విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పాలనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని, దాచుకోవడం దోచుకోవడం తప్ప ఏమీ తెలియని అరాచక పార్టీలకు తెలుగుదేశం పార్టీ గొప్పతనం తెలియదని, అందుకే నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎప్పటికీ ఇతర పార్టీలకు జై కొట్టరని అన్నారు. మహానాడులో 33 శాతం మహిళలకు సీట్ల రిజర్వేషన్లు తీసుకువచ్చి మహానాడులో మహిళా నాడుగా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన కొనియాడారు. రానున్న ప్రతి ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడుతుందని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం జెండా దిమ్మెను కూడా కదల్చలేరని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, పార్లమెంట్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, సొసైటీ చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, నియోజకవర్గ, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, గ్రామ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జిలు, క్లస్టర్ ఇంచార్జిలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.