సంఘ సంస్కర్తకు ఘన నివాళి చేగుంట లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్7 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలోభారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త డా. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక ఉప సర్పంచ్,గ్రామ వార్డ్ నెంబర్లు గ్రామ ప్రజలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఉపసర్పంచ్ రఫీ మాట్లాడుతూ, మన దేశానికి ఎన్నో సేవలు చేశారు ప్రజలకు మేలు చేశారు ప్రజలకు తెలియని విషయాలు తెలిపిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు, ఆయన జీవితకాల మొత్తం ప్రజలకే సేవా చేసిన వ్యక్తి జగ్జీవన్ రావు, ప్రతి ఒక్క రు దేశాన్ని ప్రేమించాలి దేశభక్తి అనేది ఉండాలి.ఇలాంటి మహనీయులు మన భారతదేశంలో పుట్టాలి భారతదేశానికి మంచి పేరు తేవాలి.మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల కల్లా అతి ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో చేగుంట ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ, గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్లు ఆకుల సుఖేందర్, ఉదయ్, లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రజనకు రామచంద్రం,గ్రామ ప్రజలు తలారి లింగం, కట్ట శ్రీనివాస్, సోమ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.