సంబరాలు జరుపుకుంటున్న ఇచ్చాపురం పలాస వాసులు.

★12 సంవత్సరాలు రామ్మోహన్ నాయుడు కృషి ఫలితం ★కలలో కూడా ఊహించని విశాఖపట్నం జోన్ ★రాష్ట్ర చివరి జిల్లా అభివృద్ధి పథంలో నడపటానికి ఇది ఒక మైలు రాయి ★అవిశ్రామ కృషి ఫలితమే విశాఖపట్నం జోన్ ★నూతన రైలు బండ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ★కేంద్రమంత్రికి నీరాజనాలు అర్పించిన శ్రీకాకుళం జిల్లా వాసులు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. నూతనంగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే (విశాఖపట్నం) జోన్‌ పరిధిలోకి పలాస మరియు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లను చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఉత్తరాంధ్ర ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస రైల్వే స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. పలాస స్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వారు స్వయంగా పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు.పలాస నుంచి ఇచ్చాపురం వరకు స్టేషన్లు విశాఖ జోన్‌లో చేరడంపై రైల్వే అధికారులు, స్థానిక నేతలు, ప్రజలతో కలిసి కేంద్రమంత్రి మరియు ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ నిర్ణయంతో ఈ ప్రాంత రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు, కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు రైల్వే అధికారులు పాల్గొన్నారు.