పయనించే సూర్యుడు: మే: 29/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ఏరియా ఉద్యోగుల సమస్యలపై చర్చించిన ఐఎన్టీయూసీ సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం స్ట్రక్చర్ సమావేశం జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు.సత్తుపల్లి ఏరియా పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏరియా అధికారులతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఐ.ఎన్.టి.యూ.సీ నాయకులు కోరారు.స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా సత్తుపల్లి ఉద్యోగుల నివసించే కాలనీలో కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు మరియు చుట్టు లైటింగ్ ఏర్పాటు చేయాలని , జే.వి.ఆర్ ఓసి లో నూతన మిషనరీ ఏర్పాటు , ఐ.ఈ.డి స్టడీ ప్రకారం సత్తుపల్లి ఏరియా లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు సర్దుబాటు , జే.వి.ఆర్ సి.హెచ్.పి సైలో బంకర్ లిఫ్టులు మరమ్మత్తులు చేపించాలని మరియు డిస్పెన్సరీ లో గైనకాలజిస్ట్ డాక్టర్ను నియమిస్తూ డిస్పెన్సరీ ఉద్యోగులకు పార్కింగ్ షెల్టర్ , ఆర్వో వాటర్ ప్లాంట్ , రెస్ట్ హాల్ ఏర్పాటు మరియు డిస్పెన్సరీని అన్ని వసతులతో కూడిన ఏరియా హాస్పిటల్ గా ఆధునికరించాలని కోరారు.ప్రాతినిధ్య సంఘం నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేస్తుందని , ఇప్పటివరకు ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యసాధనలో సహకరించారో ఇకముందు కూడా సహకరించి సంస్థ పురోఅభివృద్ధిలో తోడ్పడాలని జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ కోరారు.ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు బొల్లం శ్రీనివాస్ ( ఎస్ ఓ టు జి.ఎం ) , రామ కృష్ణ ( ఎ జి ఎం సివిల్ ) , తిరుపతి ( పర్సనల్ ఆఫీసర్ ) , ప్రహ్లాద్ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , జే.వి.ఆర్ ఓసి ) , సునీల్ వర్మ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , కిష్టారం ఓసి ) , శ్రీనివాస్ రావు ( ప్రాజెక్ట్ ఇంజినీర్ ) , సోమశేఖర్ ( డీజీఎం , జే.వి.ఆర్ సి.హెచ్.పి ) , రాజేశ్వరరావు ( మేనేజర్ , జే.వి.ఆర్ ఓసి ) , రామకృష్ణ ( మేనేజర్ , కిష్టారం ఓసి ) , అభిలాష్ ( సెక్యూరిటీ ఆఫీసర్ ) , సివిల్ ఇంజనీర్ రవికుమార్ , నరసింహారావు ( ఏ సీ.ఎమ్.ఓ , డిస్పెన్సరీ ) , సివిల్ అధికారులు నవీన్ , ఇతర అధికారులు , ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘం నాయకులు క్రాంతి కుమార్ , రాజేందర్ , వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.