సత్యసాయిలో కమలం జోరు పెంచనున్న కునిగిరి నీలకంఠ.

పయనించే సూర్యుడు జులై 7 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. సత్యసాయి జిల్లా బీజేపీ ఇన్‌చార్జిగా నియామకమైన సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ కునిగిరి నీలకంఠ ని ఆత్మీయంగా అభినందించి, ఆయన సొంత జిల్లాకు గౌరవప్రదంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలైన "సేవే లక్ష్యం – అంత్యోదయమే ధ్యేయం – సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్" భావనతో ప్రతి కార్యకర్త ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచనలు, మార్గదర్శకత్వంలో సత్యసాయి జిల్లాలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తూ, బూత్ స్థాయి నుంచి పార్టీని విస్తరించేందుకు కృషి చేయాలని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ , మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు శేఖర్ స్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తానన్నారు. సత్యసాయి జిల్లాలో ప్రతి మండలం, ప్రతి శక్తికేంద్రం, ప్రతి బూత్ వరకు పార్టీని బలోపేతం చేయడం, యువత, మహిళలు, రైతులు, సామాజిక వర్గాలన్నింటినీ బీజేపీతో అనుసంధానం చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. "దేశం ముందు – పార్టీ తర్వాత – వ్యక్తి చివర" అనే బీజేపీ విలువలను ఆచరిస్తూ, ప్రజాసేవే పరమావధిగా నిరంతరం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.