పయనించే సూర్యుడు మే 23, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టనట్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజల ముందుంచారని పేర్కొన్నారు ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి.. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె ప్రభుత్వం తీరు ఎండగట్టారు.. వైఎస్ జగన్ వివరించిన పరిస్థితులపై ప్రభుత్వంలోని మంత్రులు స్పందించాల్సిన తీరు ఇదేనా అంటూ ప్రశ్నించారు.. రాష్ట్రంలో పరిస్థితులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం మానుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.. ప్రజలకు సమాధానం చెప్పలేక జగన్ పై మాటల దాడికి చేయడం సరికాదన్నారు.. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్రలు వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే గురువింద తన కింద ఉన్న నలుపెరుగదు అన్ని సామెత గుర్తోస్తుందన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గంలో మైనర్ బాలిక పై అఘాయిత్యం జరగడం బాధాకరమని పేర్కొన్నారు.. అయితే గడచిన రెండు మూడు నెలల్లో ఇలాంటి ఘటన రెండవ సారి జరగడం సిగ్గు చేటన్నారు. మహిళా హోం మంత్రి అన్ని చెప్పుకోవడానికే తప్ప వంగలపూడి అనిత రాష్ట్రంలో శాంతి భధ్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేసారు.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రులు అసందర్భ ప్రేలాపనలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పులుంటే వాటిపై స్పందించేవారని, వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేక తమకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తున్నారని ఆరోపించారు.. మారుమూల గ్రామాల్లో సైతం 24 గంటలు మద్యం ఏరులై పారుతోందని ఫలితంగా జనం మత్తులో జోగుతున్నారని పేర్కొన్నారు. మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం విచారకరమన్నారు.. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ అతిగా మద్యం సేవించడమే కారణం అన్నారు. మట్టి, ఇసుక, గ్రావెల్ దోచుకుని చినబాబుకు వాటాల పంపిణీ చేసే ప్రక్రియలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మట్టి మాఫియా రవాణాకు నిష్కారణంగా యువకుడు బలైపోయాడని తెలిపారు.. ఇటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తుందన్నారు.. ప్రభుత్వాన్ని ప్రజారంజకంగా పాలించాల్సింది పోయి, చేతకాని తనాన్ని మంత్రులు జగన్ పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా చేసి నిర్థాక్షణ్యంగా పార్టీని తన వశం చేసుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.. కాపు నేత వంగవీటి రంగా ను హత్యను రాజకీయంగా వాడుకుని ప్రయోజనం పొందింది చంద్రబాబు అన్న విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ఇలా ఏ విషయంలో అయిన తనకు లబ్ది లేకపోతే చంద్రబాబు ఏ పని చేయరని స్పష్టం చేసారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలకు వివరించే క్రమంలో వైసిపి అధినేత జగన్ చేసిన విమర్శలు వాస్తవాలు కాదా అని ప్రశ్నించారు.. వాటిపై స్పందించకుండా మంత్రులు వ్యక్తిత్వం హననాకి దిగడం దురదృష్టకరమని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ కు సంబంధం ఉందని నిరూపించాలని ఎన్నో విధాలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి కుటుంబంలోనూ చిచ్చు పెట్టారని నాగమణి పేర్కొన్నారు..