పయనించే సూర్యుడు, కోరుట్ల మే 26. సోమవారం రోజు కోరుట్ల పట్టణంలోని పి.యం. శ్రీ జిల్లా పరిషత్ బాలికలు పాఠశాలలో వేసవి శిబిరం(సమ్మర్ క్యాంప్)ముగింపు వేడుకలు జరిగినవి.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ గంగాధర్ మాట్లాడుతూ పాఠశాల విద్య శాఖ జిల్లా విద్యాశాఖ ఆదేశాల ప్రకారం పాఠశాలలో 15 రోజులుగా వేసవి శిక్షణ శిబిరం ను నిష్ణాతులైన వాలంటీర్ల ద్వారా విజయవంతం గా నిర్వహించామని ,ఈ శిబిరంలో 6వ తరగతి నుండి 9 వ తరగతికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని ఇందులో ప్రతిరోజు విద్యార్థులకు అల్పాహారం అందించడంతో పాటు చిత్రలేఖనం, కుట్లుఅల్లికలు,యోగ,పర్సనాలిటీ డెవెలప్ మెంట్,నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగం, ఆర్ట్, క్రాఫ్ట్, చెస్, క్యారమ్స్, విద్యార్థుల్లో ఆత్మవిశ్వసం మరియు స్ఫూర్తి నింపే చిత్రాలను చూపించడం జరిగింది. ఈ సందర్భంగా పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు,బహుమతులను ప్రధానోపాధ్యాయులు అందజేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు సి.హెచ్ క్రిష్ణ మోహన్ రావు,అందే రాజేంద్ర,యోగ టీచర్ కస్తూరి రాజన్న,ఆర్ట్ టీచర్ పిస్క వేణు, మౌనిక,సి.ఆర్.పి పి.గంగాధర్ లు పాల్గొన్నారు.