సలకల కొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిక్కన్న అకాల మరణం.

నివాళి అర్పించిన ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు జూన్ 5 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు సలకలకొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిక్కన్న అకాల మరణ వార్త తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అలాగే బసరుకోడు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు జయరాజు సోదరుడు శ్రీనివాసులు అకాల మరణంపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, మట్టిఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.