సల్కారపేటలో ఘనంగా వీర నాగమ్మ–ఎల్లమ్మ దేవతల పండుగ ఉత్సవాలు

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి

పయనించే సూర్యుడు జూన్ 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి, జూన్ 12: బిజినపల్లి మండలం సల్కారపేట గ్రామంలో శ్రీ వీర నాగమ్మ, ఎల్లమ్మ దేవతల వార్షిక పండుగ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించడంలో ఇలాంటి దేవత ఉత్సవాలు, జాతరలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ ఎంపీటీసీ అంజి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.