పయనించే సూర్యుడు మెజర్ న్యూస్ జూలై 09.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మండలంలోని కొండయ్య గారి పల్లి పంచాయతీ బిల్లేరులో ఎల్లమ్మ దేవత విగ్రహ ప్రతిష్టను సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు వేద పండితులు అగ్రహారం ఆనందాచార్యులుచే ఉదయాన్నే అమ్మవారి ఆలయంలో పలు హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు ఎల్లమ్మ దేవత విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన వెంకటస్వామి నారాయణ వెంకటరమణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఎల్లమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు విశేష సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నదాన శిబిరాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుంచి తరలి వచ్చిన భక్తులు పాల్గొన్నారు
.
