సాంప్రదాయ బద్ధంగా వినాయక స్వామి మండలి పూజ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 13.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మండలంలోని విజయవా నిలో గల విజయ వినాయక స్వామి మండల పూజను సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు 40 రోజుల క్రితం నాయుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మించి ప్రాణ ప్రతిష్ట జరిగిన క్రమంలో మండల పూజ అదే తరహాలో ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం నందు వివిధ పూజా దికార్యక్రమాలు జరిగాయి చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి విజయ వినాయక స్వామిని దర్శించుకుని నిర్వహకులచే తీర్థప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు