సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

పయనించే సూర్యుడు , జూన్ 16,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు . ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రము , ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని,కోరిని కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకు దండ, సింధూరం సమర్పించిన ఎలాంటి కష్టాలు దరిచేరవుఅని భక్తుల విశ్వాసం. అలాంటి స్వామి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది . సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని ,ఈ ఆలయ కేంద్రం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో భక్తులు ,మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు