జనం న్యూస్ జూన్ 7 ముద్దనూరు : బెంగుళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న కత్తి మారుతి తల్లి ఆరోగ్యం బాగోలేక పోవడంతో రెండు రోజుల క్రితం భార్య కాంచమాలతో కలిసి ఊరికి వచ్చాడు. శనివారం తల్లిదండ్రులను వైద్యం కోసం కర్నూలు పంపేందుకు బస్సుకు ఎక్కించి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.పోలీసుల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే… ముద్దనూరు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన జయరాముడు,గంగాదేవి లకు నాలుగు సంతానం ఇద్దరు కుమార్తెలుగా ఒక్క మగపిల్లవాడు.కుమార్తెలకు వివాహమయ్యింది.మూడు నెలలక్రితం మారుతి(30)కి కొండాపురం మండలం గండ్లూరు కాగా ప్రస్తుతం ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న కాంచనమాలతో వివాహమయ్యింది. మారుతి బెంగుళూరులో సాఫ్ట్ వేరుగా పనిచేస్తూ అక్కడే ఉన్నారు. కాంచనమాల రెండు నెలల గర్భవతి కూడా తల్లి ఆరోగ్యం సరిగాలేక పోవడంతో రెండు రోజుల క్రితం ఊరికి వచ్చాడు. ఉదయం తల్లి వైద్య పరీక్షల కోసం తల్లిదండ్రులను కర్నూలులో బస్సు ఎక్కించేందుకు కొండాపురం వెళ్ళాడు.తిరిగి స్కూటీ పై ఓబులాపురం గ్రామానికి వస్తున్నాడు.ఓబులాపురం బస్ స్టాప్ సమీపంలో కొండాపురం వైపు నుంచి వస్తున్న బోలేరో ట్యాంపర్ వాహనంలో స్కూటీ వెనుక వైపు ఢీకొంది.దీంతో మారుతి రోడ్డుపై పడడంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా పడి ఉండటంతో చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు సంఘటనాస్థలం చేరుకొని పరిశీలించారు.పోలీసులు కేసు నమోదు చేసి,వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.