సారపాక లో పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మెళనం

ఇరవై సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యుల తో కలిసిన పూర్వ విద్యార్థులు

పయనించే సూర్యుడు, మే 26 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూర్గంపహాడ్ మండలం, సారపాక లోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో ఇరవై సంవత్సరాల తర్వాత చదువు చెప్పిన ఉపాద్యాయుని, ఉపాద్యాయులతో కలిసి స్నేహితులంతా వాళ్ళు చదువుకున్న పాఠశాలలోనే రోజంతా ఆనందంగా అప్పటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భూర్గంపహాడ్ మండలం సారపాక లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005-2006 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థిని, విద్యార్థులు ఇరవై సంవత్సరాల తర్వాత 2026 మే 24 ఆదివారం నాడు జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల లో ఒకే చోట చేరారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా 20 సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి, గెట్ టూగెదర్ నిర్వహించారు. ఆనాడు విద్య బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఆనంద్, లక్ష్మీ నారాయణ, రమణ, నారాయణ, బాలాజీ, ప్రభావతి, కృష్ణ కుమారి, పద్మావతి, దూదాబాయి లను సన్మానించారు. అంతకుముందు విద్యార్థిని, విద్యార్థులు ఇప్పటి వాళ్ళ జీవనం గురించి తెలియచేస్తూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తరగతి గదులలో చేసిన చిలిపి చేష్టలను యాది చేసుకున్నారు. రోజంతా పిల్లా పాపలతో కలిసి గడిపారు. విద్యార్థిని విద్యార్థులు మాట్లాడిన అనంతరం వారిని ఉద్దేశిస్తూ ఉపాద్యాయులు మాట్లాడటం జరిగింది. అందరూ కూడా మంచి హోదాలో ఉండడం, మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇలా పిలవడం చాలా సంతోషంగా ఉందని, మీరు ఇంకా మంచి మంచి శిఖరాలను అదిరోహించాలని, గురువుకి ఇంతకన్న ఆనందం ఇంకా ఏమి కావాలి అని వారు ఆనందం వ్యక్తం చేసారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో 150 మంది కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.