పయనించే సూర్యుడు,జూలై 08 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పరిధిలోని మదినగూడ ఆఫీస్ పై డివిజన్ సాయి నగర్ లో ఎస్ ఐ ఆర్ లో భాగంగా డీఎల్ఓ మరి యు వర్కింగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి వివరా లు ఓటర్లకు వివరించడం జరుగు తుంది.కానీ ఇదే నియోజక వర్గం లోని నందమూరినగర్,హైదర్ నగర్, హైదర్ నగర్ గ్రామములలో ఓటర్లకు బిఎల్ఓ స్థానికంగా ఉండే యువకులకు ఓటర్ల యొక్క పారా లను అందించి మీరే నింపి ఇవ్వా లని కండిషన్ పెట్టడంతో అందులో ఉన్న వాటిని రాయాలన్న జిమ్మికి గా ఉండడంవల్ల ఎవరు సరిగా చెప్పలేని వారు ఉండడం బిఎల్ఓ ల సాయ సహకారాలు లేకపోవడం ఆ. ఫారాలను నింపితే ఏం తప్పు జరుగుతదో అని సందిగ్ధంలో కొంత మంది ఓటర్ లు సతమతపడు తూ ఫాంలను నిండకుండా వదిలే సి ఉన్నారు. కనీసం ఇంటి వద్దకు వచ్చి ఫారాలను బి ఎల్ ఓ లైన నింపి లేదా ఓటర్ల ద్వారా నింపేం తవరకు సహకారం అందించవల సిన బి ఎల్ ఓలు వారి ఇష్టం వచ్చి న చోట ఎక్కడో వారి అధికారుల కు ఏ సమాచారాన్ని ఇస్తున్నారో తెలియదు గాని, ఇక్కడి చాలామం ది నిరక్షరాశులయిన ఇక్కడి ఓట ర్లు ఉండడం ఇబ్బందుల పాలవు తున్నట్లు మీడియా ప్రతినిధులతో కొన్ని బస్తీలలో వివరించారు.మి యాపూర్ నడిగడ్డ తాండ మరికొ న్ని సుభాష్ చంద్రబోస్ నగర్ బస్తీలలో సైతం ఇదే పరిస్థితి ఉందని బిఎల్ఓ వారి సాయం లేకుండా మా ఓటర్లు గల్లంతయి తారేమో అన్న సందిగ్ధంలో స్థానికు లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఓటర్ల ఇండ్లకు వచ్చి బిఎల్వోలు వారి చేతితోనైనా పారాలను నింపి తీసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల్లోని పలు బస్తీలు,కాలనీలలో కొంత మంది తెలియజేసినట్లు తెలిపా రు.