02 Nov 2026 | 11:54 PM

సాలంపాడ్ సొసైటీ చైర్మన్‌గా వెంకటేశ్వరరెడ్డి బాధ్యతల స్వీకరణ

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 సాలూర:సాలూర మండలం సాలంపాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్‌గా నియమితులైన వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సోమవారం సంఘ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా రైతులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు సర్పంచులు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాలూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి బోధన్ ఏఎంసి డైరెక్టర్ బాలకృష్ణ అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు రైతులు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు