సిఏ దుర్గాప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న కాకినాడ సిటీ టిడిపి సభ్యులు..సి ఐ కు అందనాపల్లి శ్రీనివాస్ గణ సత్కారం..

పయనించే సూర్యుడు మే 24, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ టూ టౌన్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గా ఇటీవల దుర్గాప్రసాద్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కాకినాడ సిటీ ఎండోమెంట్ డైరెక్టర్ అందనాపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టిడిపి కాకినాడ సిటీ 27వ వార్ది ఇంచార్జ్ కొడూరి పెద్ద,టిడిపి 31 వార్డు మాజీ కార్పొరేటర్ బంగారు సత్తిబాబు, 34వ వార్డ్ ఇంచార్జ్ పొంగ బుజ్జి, బాలాజీ ట్రావెల్స్ అధినేత కొట్టేటి బాలాజీ ప్రసాద్ లు దుస్సాలువతో పూల బొకే ను అందజేసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐగా దుర్గాప్రసాద్ చింతూరు నుండి కాకినాడ టూ టౌన్ మహిళా స్టేషన్ సిఐగా రావడం జరిగిందని ఈ సందర్భంగా టిడిపి నాయకులు అందరం కలిసి సిఐ దుర్గాప్రసాద్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు.