సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో కరపత్ర ఆవిష్కరణ.

"బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు గూని నందు"

పయనించే సూర్యుడు మే 31రాజేష్ దౌల్తాబాద్ ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది.సామాజిక న్యాయం - రాజ్యాధికారంసాధనే ధ్యేయంగా, ఎవరి కులం ఎంతోవారికంత వాటా అనే నినాదంతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ.జిల్లా కమిటి ఆధ్వర్యంలో జూన్ 5 వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన కర పత్రికను దౌల్తాబాద్ మండలంలోని నర్సంపేట, శేరిపల్లి, కోనాయిపల్లి, గోవిందా పూర్, పోసంపల్లి, ఉప్పరపల్లి గ్రామాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ( జేఏసీ) నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీనాయకులు గూని నందు మాట్లాడుతూ….తెలంగాణ లో ఎవరి కులం ఎంత ఉందో వారి జనాభా లెక్కల ప్రకారం వారికి అన్ని రంగాలలో సమాన వాట దక్కాలని డిమాండ్ చేస్తూ ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సభ కి ముఖ్య అతిథిగా.బీసీ.ఎస్సీ.ఎస్టి - జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ గారు హాజరు అవుతారని తెలిపారు. ఈ తెలంగాణ గడ్డమీద ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మరియు బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విషారదన్ మహారాజు గారు అనేక రూపాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కడ అన్యాయం జరిగిన తక్షణమే అక్కడికి చేరి సమస్యను పరిష్కరిస్తున్నారని అలాగే స్వశక్తి స్వధర్మంతో అగ్రకుల పార్టీలకు అభిముఖంగా నిలబడి ఉద్యమించే దిశగా యువతలో బీసీ ఎస్సీ ఎస్టీలలో రాజకీయ కోర్కెను పుట్టించి అనేక విధాలుగా చైతన్య పరుస్తున్నారని వివరించారు. జూన్ 5 వ తేదీ సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట లోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ మైదానంలో (సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రాంగణం) జరిగే ఈ బహిరంగ సభకు బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట గ్రామ సర్పంచ్ నర్సింలు,గోవిందాపూర్ గ్రామ సర్పంచ్ దాసు,కోనాయిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్,ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ మల్లేశం ఉప సర్పంచ్ నాగరాజు వార్డ్ మెంబర్ శ్రీశైలం ఆంజనేయులు సందీప్ తదితరులు పాల్గొన్నారు