సిపిఎం సానుభూతిపరురాలు మాసారపు ధనమ్మకు నివాళి

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 12,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కేంద్రం గోపాలపేటకు చెందిన సిపిఎం సానుభూతిపరురాలు మాసారపు ధనమ్మ ఈ రోజు తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు నల్లమోతు మోహన్‌రావు, ధనమ్మ మృతదేహంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. పార్టీ శ్రేయోభిలాషి దోడ్డ చిన్న శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, ధనమ్మ చిన్ననాటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేశారని, ఆమె మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ధనమ్మ కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి పారసాని వెంకటయ్య, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు కూచిపూడి వెంకటయ్య, సిపిఎం నాయకులు వెంకట నరసయ్య, తుమ్మలపల్లి వెంకటయ్య, కూచిపూడి రమేష్, మాసారపు లక్ష్మయ్య, మాసారపు నరసింహారావు, సుంకర నాగేశ్వరరావు, సుంకర కృష్ణయ్య, రాయల సీతారామారావు, ఆలస్యం బుచ్చయ్య, సాయన్న వెంకటేశ్వరరావు, సాయిని పోట్ల రామయ్య గుమ్మ రామకృష్ణ నాగేశ్వరరావు చెరుకుమల్లి వెంకటయ్య అమరనేని సత్యనారాయణ, మారెళ్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.