పయనించే సూర్యుడు మే 23 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 7.49 కోట్ల ఆర్థిక సాయం అందించాం పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ ఆత్మకూరులో 49 మందికి రూ. 44.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనంఆత్మకూరు, పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో 49మంది లబ్ధిదారులకు రూ. 44.89 లక్షలు విలువైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే 809 మంది లబ్ధిదారులకు 7,49,67,338 రూపాయలను అందించి ఆ కుటుంబాలకు తోడుగా నిలిచామని మంత్రి పేర్కొన్నారు. పేదలకు ప్రతి విషయంలోనూ మంచి చేయాలని ఆలోచనతో తమ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఆనం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.