పయనించే సూర్యుడు మే 31 హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : వెన్నంపల్లి గ్రామం లో రాష్ట్ర రవాణా &బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వెన్నంపల్లి గ్రామంలోని దండ తిరుపతి రెడ్డి 30000, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంత్రి సహకారంతో మంజూరు కాగా శనివారం రోజున అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటెల లింగారెడ్డి,బండ శివానంద రెడ్డి,మొలుగురి అశోక్,ఎండి సాదిక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.