సీనియర్ జర్నలిస్ట్ కూరకుల గోపీ మృతి పట్ల మధిర నియోజకవర్గ విలేఖరుల సంతాపం

పయనించే సూర్యుడు జూన్ 02,(చింతకాని మండలం రిపోర్టర్). మధిర : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, జనంసాక్షి దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జి, సీనియర్ జర్నలిస్ట్ కూరకుల గోపీ ఆకస్మిక మృతి పట్ల మధిర నియోజకవర్గానికి చెందిన విలేఖరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడుతున్న గోపీని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. జర్నలిజం రంగంలో నిబద్ధతతో పనిచేస్తూ సహచర పాత్రికేయుల ఆదరణ పొందిన గోపీ మృతి వార్త జర్నలిస్టు వర్గాలను విషాదంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ విలేఖరులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, గోపీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జర్నలిజం రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.