సీనియర్ వైద్యులు మనోహర్ కు కేంద్రహోం శాఖ సహాయక మంత్రి గిఫ్ట్

పయనించే సూర్యుడు జూన్ 16 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. దేశాన్ని అన్ని రంగాల్లో సురక్షితంగా ముందుకు తీసుకెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాలను (బుక్ లేట్) సీనియర్ వైద్యులు డా. కేటగిరి మనోహర్కు మంత్రి బండి సంజయ్ అందజేశారు. డాక్టర్ మనోహర్ కేంద్ర మంత్రిని సన్మానించి, సాదరంగా ఆహ్వానించారు.