జనం న్యూస్ జూన్ 07 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): సీపీఎస్ రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో పోరాటం చేస్తున్న ఏపీ సీపీఎస్ ఈఏ సంఘం ఆధ్వర్యంలో జూలై 11న అనంతపురం నగరంలో నిర్వహించనున్న “అనంతసాయి మహాసంగ్రామం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ శనివారం కొత్తచెరువు బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో ఘనంగా జరిగింది.ప్రస్తుతం పాఠశాలలో నిర్వహిస్తున్న ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీలం అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న లేదా అమలు చేయాలని భావిస్తున్న సీపీఎస్, జీపీఎస్, యూపీఎస్ వంటి పెన్షన్ విధానాలు ఉద్యోగుల భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా కల్పించవని అన్నారు. గతఏడుసంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా సీపీఎస్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసంఉపయోగించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగుల హక్కుల సాధన కోసం జూలై11నఅనంతపురంలో నిర్వహించనున్న “అనంతసాయి మహాసంగ్రామం” ర్యాలీలో ప్రతి ఉద్యోగి పాల్గొని ఐక్యతను చాటాలని, ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై సానుకూలంగా ఆలోచించేలా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మల్లికార్జున, ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, సీపీఎస్ నాయకులు నాగేంద్ర, బాలకృష్ణ, సురేష్ రాజు, నాగభూషణ, గంగరాజు, రవీంద్ర, నరేష్, హనుమంతు, విజయ్ కుమార్, శ్రీనివాసులు, హరి ప్రసాద్, సిరాజుద్దీన్, మహేష్, రవిచంద్ర, విజయ చంద్రారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, బాబు నాయక్ తదితరులతో పాటు ఉపాధ్యాయులు అశ్విని బాయి, రజిత, చెన్నమ్మ, అనూష, లక్ష్మి, ప్రశాంతి, అశ్విని, నరసమ్మ, బిందు మాధవి, సత్యవాణి, చిట్టెమ్మ, భాగ్యలక్ష్మి, ఆయేషా, సంప్రీతి బాయి, సాయి మహేష్, శ్రీరామ్ నాయక్, త్రివిక్రమ్, రామ్ కుమార్, లక్ష్మీపతి రెడ్డి, కృష్ణమూర్తి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.