సూర్యాపేటలో రేపు ప్రారంభం కానున్న వృత్తి విద్యా శిక్షకుల ‘వినతి యాత్ర’

పయనించే సూర్యడు జూలై 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​ విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే వృత్తి విద్యా శిక్షకుల (ఒకేషనల్ ట్రైనర్స్) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, రేపు సూర్యాపేటలో నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రికి కాలినడకన వినతిపత్రం అందజేసేందుకు శిక్షకులు సిద్ధమవుతున్నారు. ​తమ సేవలకు న్యాయం చేయాలని, నిలిచిపోయిన తమ కాంట్రాక్టులను వెంటనే రెన్యూవల్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వృత్తి విద్యను కాపాడాలని మరియు శిక్షకులను తక్షణమే రీ-ఎంగేజ్ చేయాలని కోరుతూ చేపట్టిన ఈ 'వినతి యాత్ర' ద్వారా తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. వృత్తి విద్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి, శిక్షకుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.