సూళ్లూరుపేటలో ప్రొబుషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారా లేరా?

పయనించే సూర్యుడు మే 28 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట,తడ ,దొరవారిసత్రం మండలాల్లో నీ‌ గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్న గాని పట్టించుకోని ప్రోబుషన్ &ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు. గ్రామాల్లో ప్రజలకు నిత్యవసర సరుకులు, త్రాగునీరు దొరికిన దొరక పోయిన, మద్యం బెల్ట్ షాపుల్లో మాత్రం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ,కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పత్రిక ముఖంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన, నియంత్రిత ధరలతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చెబుతున్న వేళ, స్థానిక స్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి . మద్యం దుకాణాల్లో ప్రతి బాటిల్‌పై ₹10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అదనపు భారం వల్ల సామాన్యులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల కథనం ప్రకారం కొందరు బహిరంగంగానే “మేమంతా సిండికేట్ అయ్యాం.. ఇంకో మూడు నెలలే ఉంది” అంటూ మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు వింటుంటే సూళ్లూరుపేట లో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టా లేనట్టా? ఇది కొందరి అక్రమ వసూళ్ల వ్యవహారమా..? లేక వ్యవస్థలో లోపాలున్నాయా..? అని ప్రశ్నించారు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇకనైనా నిద్ర అవస్థ నుండి మేలుకొని వెంటనే దర్యాప్తు చేసి వాస్తవాలను.బయటపెట్టి అదనపు వసూళ్లు చేసే మద్యం షాపుల యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు