పయనించే సూర్యుడు న్యూస్ మే 22 సాలూర : రైతులు సేంద్రియ ఎరువులు వాడకంపై ముగ్గు చూపాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కె.ఇందుధర్ రెడ్డి రైతులకుసూచించారు.గురువా రం సాలూరలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సేంద్రియ ఎరువులు వాడకం వలన కలిగే ప్రయోజనాలు రైతులకు చేకూరే లాభాల,భవిష్యత్తు తరాల భవిష్యత్తు గురించి శాస్త్రవేత్త వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సొక్కం రవి అల్లె రమేష్ గంగారం ఇల్తెపు శంకర్ శివకాంత్ ఏవో శ్వేత వ్యవసాయ విస్తీర్ణ అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.