పయనించే సూర్యుడు మే 20 (మేడ్చల్ మాధవరెడ్డి) స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 20 వసంతాల వేడుకల్లో భాగంగా సంస్థకు అత్యుత్తమ బిజినెస్ అందించిన ఏజెంట్లు మేడ్చల్ జిల్లా కీసర గ్రామానికి చెందిన రామిడి ఆనంద్ రెడ్డి, ఎన్. యాదగిరి, ఎస్. లక్ష్మయ్య, ఎం. వెంకటేశం, కె. వినయ్ మరియు లక్ష్మణ్‌లను బి.ఎమ్ రామ్మోహన్ రావు, సీనియర్ సేల్స్ మేనేజర్ రామ్ధార్ లకు సోమవారం ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా సంస్థపై నమ్మకం ఉంచిన స్టార్ హెల్త్ కస్టమర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకర హాస్పిటల్ డాక్టర్లు మరియు సుమంత్ హాస్పిటల్ డాక్టర్లు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వేడుకలో బ్రాంచ్ ప్రతినిధులు, సిబ్బంది మరియు బి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.