స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ అవగాహన సదస్సులో హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్

పయనించే సూర్యుడు జులై 8 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) సర్ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ ) ప్రక్రియపై డిండి మండలం గుండ్లపల్లి గ్రామంలో నిర్వహించిన మండల బి ఎల్ ఎ లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సు లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కూడా పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ పూర్తిగా అర్థం చేసుకుని, అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ఓటు లేకపోతే వ్యక్తి తన ప్రజాస్వామ్య హక్కును కోల్పోవడమే కాకుండా సమాజ అభివృద్ధిలో తన పాత్రను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ , బూత్ స్థాయి నాయకుడు తమ పరిధిలో ని ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఓటును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో అవసరమైన దరఖాస్తులు, పత్రాల సమర్పణ, అభ్యంతరాల నమోదు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ప్రజలకు సహాయం చేయాలని, పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండాలని కోరారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి ఓటును పరిరక్షించడమే విజయానికి బాట అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సర్ కార్యక్రమంలో అత్యంత వేగవంతంగా ఓట్లను ఆన్లైన్ చేస్తున్న బి ఎల్ ఎ లను వేదికపై దేవరకొండ ఎమ్మెల్యే , డీసీసీ అధ్యక్షులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల శశిధర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, సర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్ నాయక్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డమీది సాయి, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బీఎల్ఏలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.