స్వచ్ఛందంగా మెడికల్ షాపులను మూసి వేత..ఎమ్మెల్యే నానాజీకి వినతిపత్రం అందజేత..

పయనించే సూర్యుడు మే 21, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో కి వచ్చి తమ నిరసన తెలియజేసి వినతి పత్రం అందజేశారు. ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గిరిధర్ అధ్యక్షతన వినతిపత్రం అందజేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ జి ఎస్ ఆర్ 817 ఈ, జి ఎస్ ఆర్ 220 ఈ సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన ఆమోదం పొందలేదని అయినా ఆన్లైన్ వ్యాపారాలు నిర్వహిస్తూ మెడికల్ షాపుల జీవనోపాధికి గండి కొడుతున్నారని వారు తెలిపారు . అయితే ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో ముందు ఇవ్వాలి తప్ప ఆన్లైన్లో మందులు ఇవ్వాలా లేదా అన్నది ప్రజా అభిప్రాయం ద్వారా ముందుకు వెళ్తే మంచిదని దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చిస్తానని విషయం తెలియపరుస్తానని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గిరిధర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టి 12 లక్షల 40000 మందుల షాపులను స్వచ్ఛందంగా మూసి వేయడం జరిగింది అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రెటరీ కే సురేష్ ట్రెజరర్ హనుమంతరావు మరియు సుమారు 400 మంది సభ్యులు పాల్గొన్నారు.