స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి

★ నివాళులర్పించిన టిడిపి నాయకులు కార్యకర్తలు.శక్తి మహానాడు మహిళల భాగస్వామ్యతో సక్సెస్ ★ మహానాడుకు లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు మే 30 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అనంతపురం 12 క్లస్టర్లను వీక్షించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు అబ్జర్వర్ మాన్వి దేవేంద్రప్పఅనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు రెండు రోజుల్లో 25వేల ప్రజలు వీక్షించారు తెలుగుదేశం పార్టీ సృష్టికర్త, భావితవరాలకు మార్గదర్శి, బడుగు బలహీన వర్గాలకు దేవుడు, మన స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ రాయలసీమ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి క్లస్టర్లు టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి నీవాళులర్పించారు, రెండు రోజులు జరిగిన శ్రీ శక్తి మహానాడు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అబ్జర్వర్ గా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పగారు దాదాపు 12 క్లస్టర్లను రెండు రోజులపాటు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో వీక్షించారు, ప్రతి ఒక్క క్లస్టర్ లో మహిళలు ఎక్కువ ఉండటంతో మహిళల పట్ల హర్షం వ్యక్తం చేసినారు, తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ఎప్పుడు అండగా నిలుస్తుంది, స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు సమన హక్కు* కల్పించారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రంగంలో 33% మహిళా రిజర్వేషన్* కల్పించడానికి ముందుకు వచ్చారు, స్త్రీ అంటే మహాశక్తి మహిళల చరిత్రను తిరగ రాయడానికే తెలుగుదేశం పార్టీ పుట్టింది* అని కొనియాడారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలి ప్రజల పట్ల అందంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీలో అందరూ కార్యకర్తలే నాయకుడుగా తయారవ్వాలి అని సూచించారు.