02 Nov 2026 | 10:38 PM

హనవాళ్లులో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గుడిసె ఆది కృష్ణమ్మ విస్తృత ప్రచారం.

ఎంపీటీసీఅభ్యర్థి షాయీన బేగం, జడ్పిటిసిఅభ్యర్థి కురువ శంకరమ్మ, ఎంపిపి అభ్యర్థి సులోచనమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలి – గుడిసె ఆది కృష్ణమ్మ.

పయనించే సూర్యుడు నవంబర్ 3 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని మండలం హనవాళ్లు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొని ప్రసంగించారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హనవాళ్లు ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాయీన బేగం, ఆదోని మండలం-2 జడ్పిటిసిఅభ్యర్థి కురువ శంకరమ్మ, ఎంపీపీ అభ్యర్థి సులోచనమ్మలను ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థులు నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఉమ్మి సలీం, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రామస్వామి, హనవాళ్లు మాభాష, కురువ రఘు తదితరులు పాల్గొన్నారు.