పయనించే సూర్యుడు, మే 20 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ హఫీజ్పేట్ డివిజన్ ప్రజలకు ఈర్లా చెరువు మరియు బచ్చికుంట చెరువులను త్వరలో అందుబాటు లోకి తీసుకురావడానికి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రత్యేక చొర వతో వేగంగా అభివృద్ధి పనులు చేపట్టిస్తున్నారు. ప్రజలకు ఆహ్లాదక రమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చెరువుల పరిసర ప్రాంతాల్లో పలు సౌకర్యాల ఏర్పాట్లు కొనసాగుతు న్నాయి. ఈ అభివృద్ధి పనులను డివిజన్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ,పనులు త్వరి తగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలు ఉదయం, సాయంత్రం నడకకు ఉపయో గించుకునే విధంగా ఫుట్ ట్రాక్ నిర్మాణ పనులు కూడా కొనసా గుతున్నాయి. త్వరలోనే ఈర్లా చెరువు బచ్చికుంట చెరువులు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.