పయనించే సూర్యుడు,జూన్ 12 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలను గుర్తించి ప్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే బడి మానేసిన (డ్రాప్ అవుట్) పిల్లలు మళ్లీ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత యూనిఫామ్, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం, ఉచిత పెన్నులు, పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులతో పాటు పేద విద్యార్థులకు అందుతున్న పలు సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు బడిబాట-విద్యాబాట, ప్రతి పిల్లవాడు బడికి రావాలి, విద్యా హక్కు – ప్రతి ఒక్కరి హక్కు, ప్రభుత్వ బడి – పిల్లల భవిష్యత్తుకు మేలనే విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను వివరించి, తమ పిల్లలను ప్రభుత్వ బడికే పంపేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.