పయనించే సూర్యుడు జూన్ 2, నాగర్‌కర్నూల్, మే 31: హెల్త్ కార్డుల విధివిధానాలు ప్రకటించకుండానే, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల జీతాల్లో ప్రీమియం కోతలు విధించడం సమంజసం కాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు దెంది రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మనెమోని శేఖర్ పేర్కొన్నారు. హెల్త్ కార్డులు జారీ చేయకుండానే మే నెల జీతాల్లో 1.5 శాతం కోత విధించడం ఉపాధ్యాయులను మోసగించడమేనని విమర్శించారు. వసూలు చేసిన ప్రీమియాన్ని తిరిగి చెల్లించి, కార్డులు జారీ చేసిన తర్వాతే కోతలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే పథకం ఇష్టం లేని వారికి మినహాయింపు కల్పించడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరి జీతం నుంచే ప్రీమియం వసూలు చేయడం, డిపెండెంట్ల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.